1. సన్బల్లటు టోబీయా చేయు హేళనలు
వారలు పెట్టు శ్రమల భరించి
ఆయనతో సంతోషముగ భరించి
బయలుదేరి వెళ్ళుదము
|| యేసుని ||
2. స్తెఫను చావును మదిలో దలచి
పేతురు చెఱలో నుండుట దలచి
మోసము లెన్నియో కల్గినగాని
బయలుదేరి వెళ్ళుదము
|| యేసుని ||
3. కపట సోదరుల వలన బాధలు
అపనిందలు మా కెన్నియున్న
యేసు ప్రభువునే ద్వేషించినను
బయలుదేరి వెళ్ళుదము
|| యేసుని ||
4. కర్రలతోనే మము కొట్టినను
కత్తులతో మము ఖండించినను
ప్రజల వలన బహుగా నలిగినను
బయలు దేరి వెళ్ళుదము
|| యేసుని ||
5. అగ్నిలో నడువ వలసిన గాని
పలువిధ శ్రమలు మా పై బడినన్
చంపబడిన గొఱ్ఱెపిల్లను జూచి
బయలుదేరి వెళ్ళుదము
|| యేసుని ||
6. నిబ్బరముగ నిలుచుందుము మేము
యెహోవాయే మా పక్షము జేరి
పోరాటములో జయము చేకూర్చున్
హల్లెలూయ పాడుదము
|| యేసుని ||