1. ప్రేమించుచున్నావు నీతిని - దుర్నీతిని ద్వేషించినావు - నీవు
అందుచే నీతోటి వారికంటె - ఆనంద తైలముతో తండ్రి నిన్ను
అధికంబుగ నభిషేకించెను
ǁమహానందమానంద మాయెను ||
2. అంత్య దినముల యందున - ఆ వింత కుమారుని ద్వరా - ఈ
మానవులతోడ మాట్లాడెను - సర్వంబునకు తండ్రి తనయుని
వారసునిగా నియమించెను
|| మహానందమానంద మాయెను ||
3. తనయుండె ఆ తండ్రి మహిమ - ఆ తత్వంపు రూపంబు తానే
మహాత్మ్యమైనట్టి మాటచేత - నమస్తమును నిర్వహించుచు
అందరిలో అతి శ్రేష్ఠుడాయె
|| మహానందమానంద మాయెను ||
4. నీవు నాదు కుమారుడవు - నిన్ను ప్రేమించి కన్నాను నేను - నేడు
దండిగ తనయుని ముద్దాడుడి - నిండుగాయన నాశ్రయించుడి
రండి రండి ధన్యులు కండి
|| మహానందమానంద మాయెను ||
5. విజ్ఞాన సంపద లెల్లను - ఆ సుజ్ఞానిలో గుప్తమాయెను - ఆ
సంతోషమును పరిశుద్ధత - నమాధానము నీతి శక్తియు
విమోచన మాయెను యేసు
|| మహానందమానంద మాయెను ||
6. అందరికన్నా నీవెంతనో అతి సుందరుడవై యున్నావు - నీవు
నీ పెదవులమీద పోయబడి - నిండి యున్నది దయారసము
నిన్నాశీర్వదించెను తండ్రి
|| మహానందమానంద మాయెను ||
7. దివ్య రారాజై కుమారుడు - ఒక వెయ్యి వర్షాలు పాలించును - మహా
అంతము లేని రాజ్యమేలును - ఎందరు జయంబు నొందుదురో
అందరును పాలించెదరు
|| మహానందమానంద మాయెను ||