1. పాపములోన చచ్చిన నన్ను
ప్రభువా ప్రేమించితివి
|| ప్రభు నిను ||
2.తప్పిన నన్ను వెదకి రక్షింప
తనయుడవై వచ్చితివి
|| ప్రభు నిను ||
3. నా యాశ్రయము కూలిపోగ
నను రక్షింప నేగితివి
|| ప్రభు నిను ||
4. సిలువలో చిందిన రక్తముతో నా
కలుషములు కడిగితివి
|| ప్రభు నిను ||
5. మరణించి మరణపు ముల్లును
విరచి మరల లేచితివి
|| ప్రభు నిను ||
6. తండ్రి కుడి ప్రక్కన కూర్చుండి
తనయా తోడ్పడితివి
|| ప్రభు నిను ||
7. నాకై మరల వచ్చుచున్నావు
సంకీర్తించెద నిన్ను
|| ప్రభు నిను ||