1. పాపులు మరి పేరాశ హృదయులు
ప్రాపంచ గురువులు
నీ సొమ్మును హృదయము నడిగెదరు
దాసుని హెచ్చరిక యిదే
|| పరిపూర్ణంబగు ||
2. ఇహమును విడచిన త్యాగియె గాదా
మహాసత్య సద్గురువు
కపటము డాగులేని సుబుద్ధి
కరుణామయ హృదయుడు
|| పరిపూర్ణంబగు ||
3. కనుగొంటిమి అటువంటి గురువును
ఘనుడగు యేసు ప్రభువులో
ప్రేమానంద సమాధానముతో
పూర్తిగ నింపును మనలన్
|| పరిపూర్ణంబగు ||
4. సిలువపై మన పాపము మోసి
తొలగించెను స్వార్థమును
తనపై మన పాపములనుమోసి
మన కొసగెను విడుదలను
|| పరిపూర్ణంబగు ||