1. నీవు ఈ లోకములో నున్నను - కాని ఈ లోకమునకు జెందవు
లోకముతో ఏకీభవించకు లోకపు కాడికి చేరకుము
|| క్రీస్తు ||
2. నీ శరీరేచ్ఛ దురాశలను సిలువపైన అంత మొందించు
పరిశుద్ధాత్మచే నడిపింపబడి శరీర ఆశల నెరవేర్చకు
|| క్రీస్తు ||
3. దేవుని వాత్సల్యమును పరిశుద్ధముగా మీ శరీరములన్
అనుకూల సజీవ యాగముగ అర్పించుకొనుడి ప్రభువునకే
|| క్రీస్తు ||
4. మీరు క్రీస్తుతో లేపబడిన పైనున్న వాటినే వెదకుడి
లోకమునకు మీరు మరణించి పరలోక వాటినే ప్రేమించుడి
|| క్రీస్తు ||