1. ఆ నగర పునాది ఎంతో దృఢమైనది
స్థిరమై కదలని శాశ్వతమైనది
ప్రభువే తన వారిన్ సిద్ధపరచుచున్నాడు
అద్భుతం అద్భుతం అద్భుతనగరం
|| ఎంత ||
2. పవిత్ర జనులు తనతో వసింతురు
ఎవరిని ప్రభువు రక్తముతో కొనెనో
జయవంతులే అచ్చట చేరుదురు
విజయులై విజయులై అత్యంత విజయులై
|| ఎంత ||
3. ఇవి మానవులకు గ్రాహ్యము కానివి
ప్రభుని ఆత్మీయ జనులె గ్రహింతురు
ఆత్మయే బోధించున్ ఆత్మ సంగతులన్
ఆత్మీయం ఆత్మీయం అన్నియు ఆత్మీయం
|| ఎంత ||
4. ఆ నగర స్థితి ఆత్మకే గ్రాహ్యం
యేసు ప్రభువే ఆ రుచిని చూపించెను
పై నున్న వాటిని నిలచి చూతుము
ఆనందం ఆనందం పరలోక ఆనందం
|| ఎంత ||