పల్లవి : నేడు నే నారక్షకుని నామదిలో చేర్చుకొన్నాను
సమాధాన సంతోషము అనుభవించితి నేను
1. ప్రభువాక్యము నా పాపముచూపె – హృదయము విరిచె ఆయన ఆత్మ
గ్రుచ్చబడి నేను ఒప్పుకొంటిని – కోరితి రక్తము మదిలో
|| నేడు ||
2. ప్రభు నాపాపము చూపించగానే – ఒప్పుకొంటిని కప్పుకొనక
విశ్వాసముతో కన్నీటితో – ఒప్పుకొనగ క్షమియించె
|| నేడు ||
3. పడమటికి తూర్పెంత దూరమో – నా పాపమునంత దూరపర్చితివి
సముద్ర అగాధములలోన – నా పాపము పడవేసె
|| నేడు ||
4. మిక్కిలి శ్రమలో నెమ్మదికలిగె – నాశన గోతిలో నుండిలేపి
నీ వీపువెనుక నా పాపములు – పారవేసితివి వీవు
|| నేడు ||
5. తుడిచితిననె ప్రభు నా పాపములు – జ్ఞాపకముంచుకొననని చెప్పె
మంచు విడిచిపోయినరీతి – నా పాపము తొలగించె
|| నేడు ||