పల్లవి : కనికరించి నన్ను రక్షించు మేసయ్యా
1. పాపములోనే జన్మించినాను
పాపములోనే – జీవించినాను
|| కనికరించి ||
2. పాపము చేసితి – మాటలతోను
పాపము చేసితి – యోచనలోను
|| కనికరించి ||
3. గర్వముతో జీవి-తము గడిపితిని
హృదయమును కఠి-నము చేసికొంటి
|| కనికరించి ||
4. యేసు ప్రభూ – కష్ట-మును సహించితివి
నా కొరకు రక్త-ము కార్చినావు
|| కనికరించి ||
5. తెరచితి నా యెద – విశ్వాసముతో
యేసుని రక్తము నంగీకరించితి
యేసూ నీ రక్తమందు రక్షణ పొందితి
|| కనికరించి ||