1. ప్రేమతో పిల్చితివి - నన్ను రక్షించితివి
నీ జీవము నాలో వాడెను - నాదేవా దిగుము
|| జీవింపచేయుము ||
2. ప్రేమ చల్లారెనే - ఆత్మ కొఱతచే
శవమువలె నైతిని - నీ చేత నన్నెత్తు
|| జీవింపచేయుము ||
3. ప్రార్థన వాంఛయు - వాక్యంబు నాసక్తి
నాలో నూటగా రానిమ్ము - సర్వం సమర్పింతున్
|| జీవింపచేయుము ||
4. వైరి చెఱ వీడన్ - పోరుపట్టుదలతో
సల్పి జీవపత్రిక గా - నీచే ప్రకాశింతున్
|| జీవింపచేయుము ||
5. ఆత్మ పెండ్లికుమారా - నీరాక కొరకై
నిర్భయముతో వేచియుండ - నానిద్ర పోగొట్టు
|| జీవింపచేయుము ||
6. హల్లెలూయ పాడను - మరుపులు తొలగును
శుద్ధాత్మను వెదకును - ఎల్లరకున్ చాటన్
|| జీవింపచేయుము ||