1. గత కాలమున మన ప్రభుయేసు
నూతన దీవెనలను - ఖ్యాతిగా నొసగె మనకు
స్తుతియించెద మేసుని
నూతన అనుభవములతో - ఖ్యాతిగా సర్వశక్తుని
|| ఓ భక్తులారా ||
2. శక్తిమంతుడు మన ప్రభు యేసు
నిత్యమును దీవించును - రక్షించును మనలను తానే
సంపూర్ణముగా కాయున్
సత్యవంతుడు మన ప్రభువు - మాట తప్పని మహారాజు
|| ఓ భక్తులారా ||
3. ఎన్ని శోధనలు భువినున్న
తానే మనలను విడిపించును - శోధింపబడెను యేసు
తన సహాయము నొసగున్
కనుపాపవలె ప్రభువు కాయున్ - నిత్యము నిలుచు మనతో
|| ఓ భక్తులారా ||
4. శక్తిమంతుడు మన ప్రభు యేసు
తొట్రిల్లకుండ కాపాడును - నిర్దోషులనుగా ప్రభువు
నిలుపును తన మహిమతో
తలచుము తన కృపలను - ఎన్నడు విడువడు మనల
|| ఓ భక్తులారా ||
5. కృంగిన భక్తులారా మీరు
భంగపర్చు శత్రువుపై జగముపై చాటుడి - జయము
జయము జయమని ప్రభుకే
యుగ యుగములు మన ప్రభుకే - హల్లెలూయ గీతములతో
|| ఓ భక్తులారా ||