1. మన తండ్రి సమాధాన ప్రభువు
మన సర్వాయుధము మన నమ్రతయే
మన ఆత్మ సహాయకు డాయనే
సైన్య వీరులము సైన్యవీరులము
|| ప్రియ ||
2. ఎల్లప్పుడు యేసుని ధ్యానింతుము
ఎల్లరము జీవము నొసగెదము
చల్లని యేసు ప్రేమకై సమర్పింతుము
సైన్య వీరులము సైన్య వీరులము
|| ప్రియ ||
3. యేసు క్రీస్తుని ప్రేమకై చనిపోదుము
యేసుకై కాయ కసరులనైన తిందుము
వేసినట్టి ముందంజను వెనుదీయము
సైన్యవీరులము సైన్యవీరులము
|| ప్రియ ||
4. లోక స్నేహపు బంధముల్ త్రుంచితిమి
లోక మాయల నెల్లను విడిచితిమి
వీకతో ప్రభుని కెదల నిచ్చితిమి
సైన్య వీరులము సైన్య వీరులము
|| ప్రియ ||
5. రక్షణమార్గమిదేయని యెరిగితిమి
అక్షయంబుగ నాత్మలో నాటితిమి
లక్ష్యబెట్టము చావు బ్రతుకులను
సైన్య వీరులము సైన్య వీరులము
|| ప్రియ ||
6. వైరికోటల నాశంబు గావింతుము
కోరి శుభవేళ సత్యంబు చాటెదము
చేరిసాక్ష్యము లీయను భయపడము
సైన్య వీరులము సైన్య వీరులము
|| ప్రియ ||
7. హల్లెలూయా జయంబును తెలిపెదము
ఉల్లాసముతో ప్రభునిరాక చాటెదము
ఎల్ల పాపాంధకారముల్ బాపెదము
సైన్య వీరులము సైన్య వీరులము
|| ప్రియ ||