1. జయవంతులే దైవ పరదైసులోనున్న
జీవ వృక్షఫలమును భుజియింతురు
రెండవ మరణమును దాటెదరు
|| జయము ||
2. మరుగైన మన్నానిచ్చి మరి తెల్లరాతి నిచ్చు
ఆ రాతిమీద క్రొత్త పేరుండును
ఎరిగెదరు దాని పొందువారలే
|| జయము ||
3. ఎవరు అంతము వరకు స్థిరముగ నిలిచెదరో
ఏలెదరు జనులను అధికారులై
ఇనుప దండముతో పరిపాలించెదరు
|| జయము ||
4. ధవళ వస్త్రములను ధరింప జేయువారికి
జీవ గ్రంధమున పేరు తుడువబడదు
దేవ దూతల యెదుట ఘనత కలుగును
|| జయము ||
5. ఆలయ స్తంభముగా వారిని దేవుడు
నిలిపి స్థిరపరచి దీవించును
నూతన యెరూషలేమని వ్రాయువారిపై
|| జయము ||
6. వారిని దేవుడు సింహాసనముపైన
కూర్చుండబెట్టి జీవమకుట మిచ్చును
వారసులై నిత్యముగా జీవింతురు
|| జయము ||