1. భూదిగంత నివాసులారా
పదిలముగ ప్రభు యేసుని చూచి
ముదముగ రక్షణ మరి పొందుడి
|| మన ప్రభుయేసు ||
2. వారాయన తట్టు చూడగనే
వారలకు వెలుగు కలిగెను
వారి ముఖంబులు లజ్జింపకుండెన్
|| మన ప్రభుయేసు ||
3. మన విశ్వాసమునకు కర్తయు
కొనసాగించెడి యేసుని చూచి
వినయమున పరుగిడు పందెమున
|| మన ప్రభుయేసు ||
4. శిష్యులు కన్నులెత్తి చూడగను
యేసే కనిపించెను వింతగను
మోషే ఏలియాలు మరుగైరి
|| మన ప్రభుయేసు ||
5. ప్రభుయేసే మన పరిమళ ప్రియుడు
మురిసెదము మన ప్రభువునందు
మెరిసే మహిమలు మన భాగ్యమదే
|| మన ప్రభుయేసు ||
6. మంచి కాపరి మన ప్రభుయేసు
మనకై తనదు ప్రాణము నిచ్చెను
వినుడి మన రక్షకుని పిలుపు
|| మన ప్రభుయేసు ||
7. ఆనందముతో ఆర్భాటముతో
అందమగు శ్రీ యేసుని జూచి
హల్లెలూయా యని పాడెదము
|| మన ప్రభుయేసు ||